Bhanu: That's true. They are ingenious indeed and fascinating. Of the four she has exhibited two are very intriguing.(నిజమే. మేధస్సుతో తయారు చేసిన ఆ నమూనాలు నిజంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆమె ప్రదర్శించిన నాలుగింటిలో రెండు ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి.)Tulasi: They've held the attention of every visitor to the fair. I think she owes it to the stimulating lectures of our professors.(ప్రతి సందర్శకుడినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ విషయంలో ఆమె ఆసక్తికరంగా బోధించే మన అధ్యాపకులకు రుణపడి ఉంది.)Bhanu: She is also penning a book. It is a piece of science fiction. I've read the first few chapters of the book and found them very absorbing. It reminded me ofthe movie "The time machine".(ఆమె ఒక పుస్తకం కూడా రాస్తోంది. అది శాస్త్రీయ విషయం ఆధారంగా రాస్తున్న కథ. దృష్టి మరల్చకుండా చదివించేలా ఉంటుంది. అది నాకు "The Time machine" సినిమాను గుర్తుకుతెచ్చింది.)Tulasi: I've seen the movie too. It's really very engrossing. There's never a dull moment in the entire movie. I only wish our Indian movie makers could think of such spellbinding movies.(ఆ చిత్రాన్ని నేనూ చూశాను. దాన్ని చూస్తున్నంతసేపూ మన దృష్టిని మరల్చుకోలేం. దాంట్లో ఆసక్తి కలిగించని దృశ్యం ఒక్కటి కూడా ఉండదు. మంత్రముగ్ధుల్ని చేసే అలాంటి సినిమాలను మనవాళ్లు కూడా తీయొచ్చు కదా!)Bhanu: The novel is even better than the movie. The novel is a real page turner. (ఆ నవల ఆ చిత్రానికంటే చాలా బాగుంటుంది. ఆపకుండా చదవాలనిపిస్తుంది.)Notes: 1. Fair = Exhibition = ప్రదర్శన2. Owe something to somebody = To be in somebody's debt = To be grateful = ఒకరికి రుణపడి (కృతజ్ఞతతో) ఉండటం.India owes its freedom to great freedom fighters like Gandhi.3. Science fiction = A story based on some scientific idea = శాస్త్రీయ అంశంపై ఆధారపడిన కథ.4. Remind = Make somebody remember something = గుర్తుచేయడం.Look at the following words from the conversation above. 1. Interesting 2. Fascinating 3. Intriguing 4. Held the attention of 5. Stimulating 6. Absorbing 7. Engrossing 8. Spellbinding 9. Never a dull moment 10. Page turnerఇవన్నీ కూడా ఆసక్తికరమైన/ ఆకట్టుకునే/ కళ్లు తిప్పకుండా చేసే/ మంత్రముగ్ధుల్ని చేసే అనే అర్థం ఉన్న మాటలు.All these words mean "interesting" in varying degrees.పై మాటలన్నీ వివిధ స్థాయుల్లో 'ఆసక్తి కలిగించే' అనే అర్థం ఉన్నవే.1. Interesting = Causing you to know about something = తెలుసుకోవాలనిపించేAttracting your attention = దృష్టిని ఆకర్షించేa) Vinod: How did you find the game? I couldn't attend because I had take mom to the railway station.(ఆ ఆట ఎలా ఉంది. మా అమ్మను రైల్వేస్టేషన్‌లో దిగబెట్టడానికి వెళ్లడం వల్ల నేను రాలేకపోయాను.)Sitaram: Very interesting, you know. Till almost the end, none was sure of the result. Finally a last minute goal by our team won us the match.
2. Fascinating = Extremely interesting
= దృష్టి మరల్చకుండా/ కళ్లప్పగించేంత ఆసక్తికరంగా ఉన్న.a) Savithri: How was your holiday trip?నీ యాత్ర (హాలిడే ట్రిప్) ఎలా ఉంది?
b) Narayan: Did you watch the total solar eclipse the other day?(ఇటీవల వచ్చిన సూర్యగ్రహణాన్ని చూశావా?)Govind: I did of course. It was fascinating to see the Sun's disc so dark. There was darkness all over. Crows flew out in all over the sky in sheer panic.(చూశాను. సూర్యబింబం అంత చీకటిగా ఉండటం ఆకట్టుకునేలా ఉంది. ఎక్కడ చూసినా చీకటే. కాకులు ఆకాశంలో ఆందోళనగా ఎగిరాయి.)c) The story of the Mahabharatam is really fascinating. (మహాభారత కథ నిజంగా ఆకట్టుకుంటుంది.)3. Intriguing = Interesting, because something is strange or unusual. = విచిత్రంగా/ మామూలుగా లేకపోవడం వల్ల ఆసక్తి రేకెత్తించే.If something is intriguing, it is very interesting because it is strange or unexpected.Intriguing = మామూలైంది కాకపోవడం వల్ల, విచిత్రంగా ఉండి ఆసక్తిని కలిగించేది. a) Shashank: Why are you so absent minded? What are you thinking of?(ఏంటి అంత పరధ్యానంగా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు?)
b) Anand: Something extraordinary happened yesterday. I saw Bhagat and Abhi sitting over a table and talking to each other seriously.(నిన్న ఓ అసాధారణ సంఘటన జరిగింది. భగత్, అభి ఒక టేబుల్ దగ్గర చాలా గంభీరంగా ఏదో మాట్లాడుకుంటున్నారు.)Bharath: That's really intriguing. Such deadly enemies sitting together! Something is really in the offing.(అది చాలా విచిత్రంగా, ఆసక్తికరంగా ఉంది. బద్ధ శత్రువులు ఒకచోట కూర్చొని మాట్లాడుకోవడమా! అయితే ఏదో జరగబోతుంది.)"Intrigue" has another meaning too.Intrigue = Evil Plot = కుట్ర.a) Politics are full of deceit and intrigue (రాజకీయాలు మోసంతో, కుట్రతో కూడుకుని ఉంటాయి.)b) The Prime Minister lost his power and position as a result of theintrigue of the military generals (సైన్యాధిపతుల కుట్ర మూలంగా ప్రధానమంత్రి తన అధికారాన్ని, పదవిని కోల్పోయాడు.)
b) Farook: What's holding his attention so much on the TV? He's (He has) been glued to it for an hour now?(టీవీలో అంత దృష్టి మరల్చకుండా చూసేంత విషయమేముంది? గంట నుంచీ దానికే అతుక్కుపోయాడు).Ganesh: Some Breath taking acrobats performed by a yougster of just seven years. (ఏడేళ్ల కుర్రాడు ఊపిరిబిగబట్టేలా చేస్తున్న విన్యాసాలు.) Acrobats = Circus feats5. Stimulating = Exiting = అమితాసక్తిని కలిగించే/ ఉత్సాహాన్ని కలిగించే/ ఆలోచనను రేకెత్తించే.a) Giridhar: I couldn't get you until very late last night? What were you busy with?(నిన్న రాత్రి చాలా పొద్దుపోయే వరకు నువ్వు నాకు దొరకలేదు? ఏంటీ అంత తీరిక లేకపోవడం?)Gurunath: We had a stimulating discussion of politics.(మేము ఆలోచనలు రేకెత్తించే రాజకీయ చర్చలో ఉన్నాం.)
6. Absorbing = మనసును, దృష్టిని మరల్చనీయనంత ఆసక్తి/ అనుభూతిని కలిగించే = Holdingyour attention for a long time because it is very interesting and enjoyable.a) Brihat: What is it that is so engaging in the book?(ఆ పుస్తకంలో నిన్ను అంతగా ఆకట్టుకున్న విషయం ఏముంది?)Charan: It's (It is) an absorbing book telling us how the author rose from being a tramp to be the leader of a popular party.(ఈ పుస్తకంలో రచయిత, తాను ఓ తిరుగుబోతు స్థాయి నుంచి ప్రజాభిమానం ఉన్న పార్టీ నాయకుడిగా ఎలా ఎదిగాడో ఆసక్తికరంగా వివరించాడు.) Tramp = Loafer
= తిరుగుబోతు
c) It was an absorbing dance performance = అది దృష్టి మరల్చనీయని నాట్య ప్రదర్శన.7. Engrossing = (A book/ movie/ story/ your own work) so interesting that you do not notice what is going on around you. (పక్కన ఏం జరుగుతున్నదీ గమనించలేనంత తన్మయత్వం కలిగించే పుస్తకం/ సినిమా/ కథ/ మనం చేస్తున్న పని)
Engrossing = తన్మయత్వం కలిగించే Engrossed = మైమరచిపోయేb) Sakhi: Shall We call Smitha? (స్మితకు ఫోన్ చేద్దామా?)Chandana: I'm afraid she won't take our call. She is usuallyengrossed in listening to music at this time.(ఫోన్‌కు బదులిస్తుందా అని నా అనుమానం. మామూలుగా ఈ సమయంలో ఆమె సంగీతం వింటూ మైమరచిపోతుంది.)8. Spellbinding = (A story/ film/ music etc.,) so interesting that you cannot take your eyes away from it/ think of anything else = మంత్రముగ్ధుల్ని చేసే/ మన కళ్లు తిప్పకుండా ఉండేంత ఆసక్తికరంగా ఉన్న (కథ, సినిమా, సంగీతం లాంటివి.)Spell = Magic (మాయాజాలం)Binding = Making you motionless.Spellbinding = మంత్రముగ్ధుల్ని చేసే
b) Durga: You missed a once-in-a-lifetime opportunity yesterday.(నిన్న నువ్వు జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నావు.)Vaidehi: What are you taking of? (దేని గురించి మాట్లాడుతున్నావు?)Durga: You missed the spellbinding performance of our friend Kavitha onthe TV.(మన స్నేహితురాలు కవిత మంత్రముగ్ధుల్ని చేసేవిధంగా ఇచ్చిన టీవీ ప్రదర్శనను కోల్పోయావు.)9. Never a dull moment = అనాసక్తికరం కాని క్షణం అంటూ లేకపోవడం = మొత్తం ఆసక్తికరంగా ఉండటం (సినిమా, కథ, పుస్తకం, ప్రదర్శన లాంటివి)a) Ravi: You've been (you have been) talking all the time about the movie, was itso great? There was never a dull moment with Piers Brosnan as James Bond.
10. A Page turner = (A book) so interesting that you keep turning the pages toknow what happens next.మరుక్షణంలో ఏమవుతుందో అనే ఉత్సుకతతో ఆపకుండా పేజీలు తిప్పేలా చేసే కథ/ పుస్తకం.)a) Sajjan: Thank you very much. (నీకు చాలా ధన్యవాదాలు)Bhaskar: What for? (ఎందుకు?)Sajjan: The book you lent me is a page turner. I couldn't put the book down until I completed it.(నిన్న నువ్వు నాకు ఇచ్చిన పుస్తకం అత్యంత ఆసక్తికరంగా ఉంది. చదవడం పూర్తయ్యేవరకూ పక్కన పెట్టలేకపోయాను.)
ఈ lesson లో "Interesting" అనే అర్థం వచ్చే వివిధ Expressions చూశాం కదా! వీటన్నిటి అర్థం దాదాపుగా ఒకటే అయినా వాటిలో ఎక్కువ, తక్కువ భేదాలే కాకుండా వాటిని వాడాల్సిన సందర్భాల్లో కూడా చాలా తేడాలున్నాయని గమనించండి. అర్థ సామీప్యం ఆధారంగా ఈ పాఠ్యాంశంలోని మాటలను కింది groups గా విభజించవచ్చు. 1. Interesting 2. Fascinating 3. Holding attention 4. Absorbing 5. Spellbinding 6. Engrossing 7. There's never a dull moment 8. A page turner 9. Couldn't put it down 10. Intriguing వీటిలో మొదటి మూడింటిని కథలు, పుస్తకాలు, సినిమాలకు వాడవచ్చు. 4, 5, 6 మాటలను ప్రదర్శనల (Performances)కు, పుస్తకాలు, కథలు, మనం చేస్తున్న పనులకు వాడతాం. 7, 8, 9 పదాలను పుస్తకాలు, కథల పుస్తకాలకు మాత్రమే వాడతాం. వీటన్నింటికీ 'ఆసక్తికరమైన/ ఆకట్టుకునే/ మైమరపించే/ తన్మయత్వం కలిగించే/ మంత్రముగ్ధుల్ని చేసే అనే అర్థాలు సాధారణం.
|
myenglishvocabulary
Monday, December 28, 2015
Vocabulary - 12
Vocabulary - 11
Abhiram: No. I am afraid you are far off the mark. I put it at anything around 95%. Remember he stood first in the college.(కాదు. నీ ఊహ వాస్తవ విలువకు చాలా దూరంగా ఉందని భావిస్తున్నాను. నేను 95% దగ్గర ఉండవచ్చని అనుకుంటున్నాను. అతడు కాలేజ్ టాపర్ అని గుర్తుంచుకో.)Aparna: The estimates of the lectures are that this time at least ten students will get more than that.(ఈసారి కనీసం పది లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు తొంభై అయిదు శాతం కంటే ఎక్కువ మార్కులు పొందుతారని అధ్యాపకుల అంచనా.)Abhiram: That certainly is a rough guess. The actual number may be even more than that. For one thing, the college this time had reopened earlier and the students had more time to prepare.(అది అంత కచ్చితం కాని ఊహే. అసలు సంఖ్య అంత కంటే ఎక్కువే ఉండొచ్చు. మరో విషయం ఏమిటంటే... ఈసారి కాలేజీ ముందే తెరిచారు, విద్యార్థులు సిద్ధమవడానికి ఎక్కువ సమయం లభించింది.)Aparna: My hunch is that our friend Neelaveni might top the list of high achievers.(ఎక్కువ మార్కులు సాధించేవారి జాబితాలో మన స్నేహితురాలు నీలవేణి ముందుంటుందని నేను అనుకుంటున్నాను.)Abhiram: I don't agree with you. Even a wild guess cannot rate her as the topmost. You have overlooked Mihir.(నీతో నేను ఏకీభవించను. ఎంత ఆధారంలేని ఊహలోనైనా ఆమెను అందరి కంటే ముందుంచలేను. మిహిర్ విషయం మర్చిపోకూడదు.)Aparna: Mine was just a shot in the dark. You may be right.(నేను చెప్పింది చీకట్లో వేసిన బాణం లాంటిది. నువ్వే కరెక్ట్.)Abhiram: All this is, I admit, and so should you, is just guesswork. It is better for us to wait till the results are out.(ఇదంతా ఊహ మాత్రమే. నేను అంగీకరిస్తున్నాను. నువ్వూ అంగీకరించాలి. ఫలితాలు వచ్చేదాకా వేచి ఉండటం మంచిది.)Aparna: I hope you have noticed it. There has been a lot of speculation about the postponement of exams and the method of selection of candidates for the entrance exams.(నువ్వు గమనించావని అనుకుంటున్నా. ఈసారి పరీక్షల వాయిదా, ప్రవేశ పరీక్షకు విద్యార్థుల ఎంపిక గురించి చాలా ఊహాగానాలు జరిగాయి.)Abhiram: Let's wait and see. (చూద్దాం.)Now look at the following sentences from the conversation above: 1) I can only guess/ That certainly is a rough guess/ That is a wild guess. 2) I put it at anything around 95%. 3) The estimates of the lectures..... 4) My hunch is that our friend..... 5) All this ..... just guess work. 6) There has been a lot of speculation about the postponement..... The word we are discussing in this lesson is, 'guess'.'Guess' means 1) Think or suppose 2) Say what you think of something without knowledge of facts.ఇప్పుడు మనం'guess', దానికి సంబంధించిన ఇతర మాటలు గురించి తెలుసుకుందాం.1) Guess (గెస్) = 1) అనుకోవడం/ ఊహంచుకోవడం 2) నిజం సరిగ్గా తెలియనప్పుడు ఒక విషయం గురించి మనకు ఉండే ఊహ.a) Krishna: Did you answer all the questions?(అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాశావా?)Amruth: I did. But I did not know all the answers so I guessed some of them. I hope my guesses are correct.(చేశాను. కానీ నాకు అన్ని ప్రశ్నలకు జవాబులు తెలియవు. కాబట్టి కొన్నింటిని ఊహించాను. నా ఊహ కరెక్టేనని అనుకుంటున్నాను.)
(ఇలాంటి విషయాల గురించి నీకంటే నాకే కొంచెం ఎక్కువగా తెలుసు. సర్వలాభ సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయని అనుకుంటున్నాను.)
Make a guess =Guess something when explaining how something might have happenedఉజ్జాయింపుగా అనుకోవడం/ చెప్పడంChakri: Why do you think he is late? What might have happened?(అతడికి ఎందుకు ఆలస్యమైందని అనుకుంటున్నావు నువ్వు? ఏం జరిగి ఉండవచ్చు?)Santhan: How do I know? I can only make a guess. He must have been caught in a traffic jam.(నాకెలా తెలుస్తుంది? నేను ఊహించాను అంతే. అతడు ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కుని ఉండొచ్చు.)Rough guess = The number or amount we give when we are not sure of the exact number or amount= అంత కచ్చితం కాని ఊహ.a) Venkat: How many, do you think, saw the movie on the day of its release?(ఆ చిత్రం విడుదలైన రోజున ఎంతమంది చూశారని అనుకుంటున్నావు?)Sravan: The figure the movie people give is 27 lakh, but I think it is only arough guess.(ఆ సినిమావాళ్లేమో 27 లక్షల మంది చూశారని అనుకుంటున్నారు, కానీ అది కేవలం ఊహే/ అంత కచ్చితంకాని ఊహేనని నేను అనుకుంటున్నాను.)b) Suman: How old do you think the actor is?(ఆ నటుడి వయసు ఎంతనుకుంటున్నావు?)Jairam: I'd (I would) say he is about 35, but that's only a rough guess.(35 సంవత్సరాలు కావచ్చు. కానీ అదంత కచ్చితం అని చెప్పలేను. నా ఊహ మాత్రమే.)A wild guess = A guess especially in an answer that is stupid or very wrong. = ఏదైనా ప్రశ్నకు తప్పుగా లేదా తెలియనప్పుడు ఊహించి ఇచ్చే సమాధానం.Prasad: Where does the Ganga empty into the sea?(గంగానది సముద్రంలో ఎక్కడ కలుస్తుంది?)a) Prakash: I think somewhere in Odisha sir. (ఎక్కడో ఒడిశాలో అనుకుంటానండి.)Prasad: That's a wild guess, isn't it? You don't know the answer. That's it.(ఏదో ఊహించుకుని చెప్పావు కదా! నీకు జవాబు తెలియదు. అదీ సంగతి.)b) Vinai: Guess who is going to teach us Maths this year?(ఈ సంవత్సరం మనకు లెక్కలు ఎవరు బోధిస్తారో చెప్పు.)Kaivalya: Mine can only be a wild guess, because I don't know.(నేను ఊహించి మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నాకు సమాధానం తెలియదు.)2) Put (something) at = To guess the cost/ value/ age/ amount of damage etc.ధరలు, పరిమాణం లాంటివాటిని ఉజ్జాయింపుగా ఊహించుకోవడం. (ఒక వస్తువు విలువ, వయసు/ జరిగిన నష్టం లాంటివాటిని.)
3) Estimate: State the price of something, the number of things/ people at a place etc., partly by calculations and partly by guessing.విలువకట్టడం/ అంచనా వేయడం కొంత లెక్క చేయడం ద్వారా, కొంత ఊహించడం ద్వారా.
(మనం క్యూలో ఉండాల్సిన సమయాన్ని బట్టి చూస్తే, 5000 నుంచి 6000 మంది ఉండొచ్చని అంచనా.) (crowd = గుంపు)b) Vikas: What might be loss caused by the floods?(వరదల వల్ల కలిగిన నష్టం ఎంత ఉండొచ్చు?)Sunath: The engineers and the revenue officials estimate the loss to be in hundreds of crores.నష్టం వందల కోట్లలో ఉండొచ్చని ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు/ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారుల అంచనా ప్రకారం నష్టం వందల కోట్ల రూపాయలు.4) Hunch = A feeling that you know what is going to happen, though you cannot prove it. = మనకప్పుడప్పుడు ఏదో జరగబోతోందని కలిగే భావన, అయినప్పటికీ మనం దాన్ని నిరూపించలేం.a) Subhas: You are trying to say something, aren't you? Out with it.(ఏదో చెప్పాలని అనుకుంటున్నావు కదా? అదెదో చెప్పు.)Murali: I have a hunch, it's only a hunch mind you, but it is possible that Mitra has stolen the money.(నాకేదో అనిపిస్తోంది, అది నా ఊహ మాత్రమే సుమా! ఆ డబ్బు దొంగిలించింది మిత్రా అనే అనిపిస్తోంది.)
(మన కస్టమర్ల అభిరుచులను ఊహించేందుకు ప్రయత్నిస్తున్నా. నన్ను disturb చేయకు.)Kailas: Conduct a survey and find out what suits the customer rather than waste time on guess work.(ఇలాంటి ఊహాగానంతో కాలయాపన చేసే బదులు, ఒక సర్వే జరిపి, కస్టమర్లకు సరిపోయేదేదో కనుక్కో.)b) Sundar: I wonder why the police took such a long time to solve the case.(ఆ కేసును ఛేదించడానికి పోలీసులు అంత సమయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు.)
Tarun: There has been a lot of speculation about the cause, but no one is clear. It is perhaps the fear of corruption charges against him.(ఆ కారణం గురించి చాలామంది రకరకాలుగా అనుకున్నారుగానీ, ఎవరికీ స్పష్టంగా తెలియదు. అవినీతి ఆరోపణలకు భయపడి చేసి ఉండొచ్చు.)
|
Vocabulary - 10
Santosh: You shouldn't have entered into the contract in Vasu's presence. He is a busybody with a wagging tongue.(వాసు ఉండగా నువ్వా Contract ను కుదుర్చుకోకుండా ఉండాల్సింది. అతడు అందరి విషయాల్లో కల్పించుకుంటూ వాగుతూ ఉంటాడు.)Anupam: What has he to do with it? It's my private affair. If he wags about it to others, I'll tell him not to poke his nose into my affairs.(అతడికేం సంబంధం దీంతో. అది నా స్వవిషయం. దాన్ని గురించి ఇతరులతో వాగితే నా విషయాల్లో తలదూర్చొద్దని కచ్చితంగా చెప్పేస్తాను.)
(అతడు తనకు తెలియని విషయాల్లో తలదూరుస్తాడని నాకు తెలుసు కానీ, ఇంత ఇబ్బంది పెడతాడని అనుకోలేదు).Santosh: He is a greater nuisance than you can imagine. I've told him a number of times to stayout of it but he hasn't changed.(మనం ఊహించలేనంత ఇబ్బంది కలిగిస్తాడు. చాలాసార్లు చెప్పానతడికి, నా విషయాల్లో కల్పించుకోవద్దని, కానీ, అతడు మారలేదు).Anupam: I will avoid him in future. I'll (I will) have nothing to do with him.(ఇక ముందు అతడిని పట్టించుకోను. అతడితో అసలు పెట్టుకోను.)Santosh: Tell him he'd (he had) better stay out of it.(అతడితో చెప్పు, ఈ వ్యవహారాలకు దూరంగా ఉండమని (వాటి మానాన వాటిని వదిలేయమని))Anupam: That'll (That will) surely have an effect.(దానికి తప్పకుండా ఫలితం ఉంటుంది).Santosh: Bye.Look at the following expressions from the conversation above. 1) He is a busybody with a wagging tongue. 2) What has he to do with it? 3) ... not to intrude upon others 4) I have told him to stay out of it. 5) I'll have nothing to do with him. 6) I'll tell him not to poke his nose into my affairs.పై expressions అన్నీ కూడా 'అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం/కల్పించుకోవడం' అనే అర్థాన్ని ఇస్తాయి.ఇవన్నీ కూడా ‘Interfere'- కల్పించుకోవడం/ జోక్యం చేసుకోవడం అనే మాటకు వివిధ రూపాలు, సంబంధం ఉన్న మాటలు. వీటిలో కొన్ని చాలా వ్యావహారికమైనవి. వాటిని మన సంభాషణల్లో వాడి, సంభాషణను సహజంగా ఉండేలా చేసుకోవచ్చు.Interfere = సంబంధించని విషయాల్లో తలదూర్చడం.a) Likith: You've (You have) been in this profession for quite sometime? How much have you saved?(నువ్వు ఈ వృత్తిలో చాలాకాలంగా ఉన్నావు? ఏమైనా పొదుపు చేశావా?)
b) Mohan: Hope the police would leave the agitators alone.(పోలీసులు ఆందోళనకారులను వాళ్ల మానాన వాళ్లను వదిలేస్తారని ఆశిస్తున్నా.)Mihir: The protesters are peaceful and I am sure the police will not interfere.(నిరసనకారులు శాంతియుతంగా ఉన్నారు, అందుకని పోలీసులు జోక్యం చేసుకోరని నమ్ముతున్నా.)Interfere ను మనం చాలా సందర్భాల్లో వాడుతుంటాం. అవి:The law will take its own course. The Govt. should not interfere .
(చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు.)Interfere in and interfere with - వీటి తేడా తెలుసుకోవడం అవసరం.ఒకరి విషయాల్లో జోక్యం చేసుకోవడం - Interfere in;ఒకరి ఆలోచనలను మార్చే ప్రయత్నం - Interfere with (ప్రభావితం చేయడం)c) Natesh: Why has the court refused bail to the big wigs in Jail now?(ప్రస్తుతం జైల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులకు కోర్టు బెయిల్ ఎందుకు తిరస్కరించింది?)Nikhil: Because it feels that if they are free, they may interfere with the witnesses.(వాళ్లు స్వేచ్ఛగా బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టు భావిస్తుంది).సంభాషణల్లో వాడిన ఇదే అర్థం ఉన్న మిగతా expressions.1) A busybody = A person who often interferes in others' affairs/ tries to advise them / one too interested in other people's matters = ఇతరుల విషయాల్లో తరచూ జోక్యం చేసుకుంటూ, అనవసర సలహాలు ఇచ్చేవాళ్లు/ ప్రతి ఒక్కరి విషయంలో తలదూర్చేవాళ్లు.a) Navin: Who were you talking to, a few minutes ago? (కొద్ది నిమిషాల కిందట ఎవరితో మాట్లాడుతున్నావు?)Madhu: A neighbour of ours. He is a busybody, who none of his neighbours can escape.(మా పొరుగింటాయనతో. ఉత్త ఆరాల మనిషి. ఆయన్నుంచి పొరుగువాళ్లెవరూ తప్పించుకోలేరు.)b) Shanmukh: Talk low. Keep your voice down. (నిదానంగా మాట్లాడు. గొంతు తగ్గించు)
2) To do with = To be connected with = సంబంధం ఉండటం.
ఇది చాలా ఉపయోగకరమైన, తరచూ వాడే Phrase. మీ సంభాషణలో ఉపయోగించండి.b) All the ministers accused claim that they have nothing to do with Raghu's affairs.ముద్దాయిలుగా పేర్కొన్న మంత్రులందరూ తమకు రఘు విషయంలో ఏం సంబంధం లేదని అంటున్నారు.
(Accused = ముద్దాయి(లు)) (claim = చెప్పుకోవడం)c) What have I to do with the accident?నాకూ ప్రమాదానికి ఏం సంబంధం?3) Intrude upon: to be at/ go to a place where you are not wanted = మనం ఉండకూడని చోట ఉండటం/ వెళ్లకూడని సందర్భంలో వెళ్లడం.Suppose two people are talking to each other. Going to them and joining them is intruding.ఇతరులేదో మాట్లాడుకుంటుంటే వాళ్ల మధ్యలో దూరి కల్పించుకోవడం - intruding upon/ Intrusiona) Umesh: I am leaving this company. I can't work here any longer.(నేనీ కంపెనీ వదిలేస్తున్నా. ఇక ఇక్కడ ఏ మాత్రం పనిచేయలేను).Sukumar: What's (What has) happened? (ఏం జరిగింది?)Umesh: The company doesn't have the right to intrude upon my personal life. Why do they want to know what I do at my leisure time, where I go on holidays etc. (నా వ్యక్తిగత జీవితంలో కల్పించుకునే హక్కు కంపెనీకి లేదు. తీరికవేళల్లో నేనేం చేస్తాను, సెలవుల్లో ఎక్కడికి వెళ్తాను, ఇవన్నీ వాళ్లకెందుకు).b) Sarath: What do you want? Giri? (ఏం కావాలి గిరి?) Giri: Oh, I didn't know you were talking to your friend. Sorry for intruding upon you.(నీ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నావని నాకు తెలియదు. క్షమించు. మీకు ఇబ్బంది కలిగించినందుకు)
b) Nethaji: What's your problem with your father?(మీ నాన్నగారితో నీకేంటి గొడవ?)Prathap: Is it any of your business? It's something between me and my father. You stay out of it and let me handle it myself.(నీకెందుకు? ఇది నాకూ, మా నాన్నకూ సంబంధించిన విషయం. నువ్వేం కల్పించుకోకు. నాకొదిలెయ్.) (Stay out of it = దాదాపు నోర్మూసుకో.)Stay out of it = keep out of it.5) Poke your/ one's nose/ stick your nose (into others' affairs) = interfere = తలదూర్చడం/ చికాకు కలిగించేవిధంగా అనవసర విషయాల్లో కల్పించుకోవడం.a) Jagan: I see you are packed. Where are you going? Alone or with your wife? You'd better take your wife too. Let her enjoy too.
b) Tarun: Kumar was asking me yesterday about your salary and if you were saving any money. He wanted to know how you were able to buy this house?(నిన్న కుమార్ నీ జీతం గురించి, నీ పొదుపు గురించి నన్ను అడుగుతున్నాడు. ఈ ఇల్లు ఎలా కొనగలిగావు అని కూడా అడిగాడు.)Venkat: Why didn't you tell him not to poke/ stick his nose into things that don't concern him?(తనకు సంబంధంలేని విషయాల్లో తలదూర్చొద్దని ఎందుకు చెప్పలేదు నువ్వు?)గమనించాం కదా, జోక్యం చేసుకోవడం/ కల్పించుకోవడం/ తలదూర్చడం/ ఆరాలు తీసే స్వభావం లాంటి అర్థాలు తెలిపే English expressions. వీటిని మనం సంభాషణలో వాడదాం.ఇవి కూడా చూడండి: Leave well alone/ Let well alone = వదిలెయ్ అని అర్థం.Venu: I should have left well alone/ let well alone and never told the police about it.( police తో చెప్పకుండా, ఆ విషయం అంతటితో వదిలేసి ఉండాల్సింది నేను.)Venkat: Yea, that'd have been better. (అవును. అది మెరుగ్గా ఉండేది).
|
Vocabulary - 9
Janaki: I am searching for information on healthy food and nutrition. Can you suggest some books with a lot of material on it?(ఆరోగ్యకరమైన ఆహారం, పోషక పదార్థాల సమాచారం కోసం వెతుకుతున్నాను. దాన్ని గురించి బాగా సమాచారం ఇచ్చే పుస్తకాలను నువ్వేమైనా సూచించగలవా?)Sobha: Oh, they are easy to find. We have plenty of information on it on the google. We have a lot of books on it too.
Sobha: That's nonsense. We have an abundant stock of books in our library. Go to any good book shop in the city and you find books with copious information. But what do you need all this for?(అది అర్థం లేని మాట. మన గ్రంథాలయంలోనే అపారమైన సమాచారాన్నిచ్చే పుస్తకాలు చాలా ఉన్నాయి. నగరంలో ఏ పుస్తకాల దుకాణానికెళ్లినా, అక్కడ నీకు ఎంతో సమాచారాన్నిచ్చే పుస్తకాలు చాలా దొరుకుతాయి. అది సరే కానీ, ఇపుడెందుకిదంతా నీకు?)Janaki: I have to make a speech on the subject and that too in the presence of experts. If I make a good job of it, more invitations will follow.(ఆ విషయం మీద నేనో ప్రసంగం చేయాలి, అది కూడా నిపుణుల సమక్షంలో. అది బాగా చేస్తే మరిన్ని ఆహ్వానాలు వస్తాయి.)Sobha: You are an excellent speaker. Once they listen to you, you will get countless offers. You will be ever in demand.(నువ్వు గొప్ప వక్తవు. ఒకసారి నీ ప్రసంగాన్ని విన్నారంటే నీకు అసంఖ్యాకమైన పిలుపులు వస్తాయి. నీ ప్రసంగాలకు మంచి డిమాండ్ ఉంటుంది.)Janaki: You have given a number of lectures already, but this happens to my first major exercise.(నువ్వు ఇప్పటికే చాలా ఉపన్యాసాలు ఇచ్చావు. కానీ, ఇది నా మొదటి పెద్ద కసరత్తు.)Sobha: Wish you all luck.Notes: 1. Nutrition = పౌష్టికాహారానికి సంబంధించిన, పౌష్టికాహారం. 2. Come across = అనుకోకుండా దేన్నైనా/ఎవర్నైనా చూడటం, కలుసుకోవడం.Now look at the following expressions from the conversation above:1) Can you suggest some books with a lot of information on it.2) We have plenty of information on it.3) OK. Everybody says there are numerous books on the subject.4) We have an abundant stock of books on the subject in our library.5) You find books with copious information.6) You will get countless offers. పైన underline చేసిన మాటలన్నీ కూడా 'ఎక్కువ సంఖ్య' (a number of)/ 'చాలా', అనే అర్థం ఉన్న మాటలు. అన్నింటి అర్థం 'చాలా' నే అయినా అవి వాడే సందర్భాలన్నీ ఒకటి కాకపోవచ్చు. కాబట్టి, ఏ మాటను ఏ సందర్భంలో వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.'ఎక్కువ సంఖ్యలో', 'చాలా' అనే అర్థంతో మనం మామూలుగా వాడే మాట. 'many'. many - చాలా (countables - లెక్కపెట్టేవాటికి వాడతాం.)అయితే ఓ ముఖ్య విషయం: 'Many' ని correct English లో చాలావరకూ 'not' తోనే వాడతాం. 'ఎక్కువ లేవు' అనే అర్థంతో. questions లో కూడా వాడతాం.
Many people attended the party yesterday - ఇది అంత సరైన English కాదు. 'చాలా మంది పార్టీకి వచ్చారు నిన్న' అనే అర్థంతో చెప్పాలంటే, 'Many people' బదులు, 'A lot of people/ a large number of/ a number of people attended the party అనడం correct.a) Rupa: How many attended your class this morning? (ఈరోజు ఉదయం నీ క్లాసుకు ఎంత మంది హాజరయ్యారు?)Sheela: Not many. It was too cold in the morning. That perhaps was the reason. (ఎక్కువేం రాలేదు. పొద్దున చాలా చలిగా ఉంది. అది కారణమై ఉండొచ్చు.)చూశారు కదా? పై సంభాషణలో, many ని, not తో question లో వాడాం కదా? అదీ 'many' ఉపయోగించే విధానం.b) Sudha: Where can I get such books? (అలాంటి పుస్తకాలు నేనెక్కడ పొందగలను?)Prabhakar: Oh, you find plenty of such books in our college library. (అలాంటి పుస్తకాలు మన కాలేజీ లైబ్రరీలో చాలా దొరుకుతాయి.)
ఇలా 'చాలా/ ఎక్కువ సంఖ్యలో' అనే అర్థంతో 'a lot of', 'plenty of' అని వాడతాం. అలాగే ఇదే అర్థంతో మనం వాడగల మరో మాట: numerous/ a number of/ a large number of/ a great number ofNumerous = a large number of/ a great number ofa) Gajendar: He is surely going to be sentenced. (అతడికి కచ్చితంగా శిక్షపడబోతోంది/ అతడు కచ్చితంగా శిక్షింపబడతాడు.)Hemanth: How do you know?
(నీకెలా తెలుసు?)
Abundant = plenty of = large number of = ఎక్కువ సంఖ్యలో ఉన్న/ చాలాa) Karthik: Why do you like that company?You can try for a job in other companies too. You are so highly qualified.(ఆ కంపెనీనే ఎందుకిష్టపడతావు నువ్వు? ఇతర కంపెనీల్లో కూడా ప్రయత్నించవచ్చు కదా. నీకు మంచి విద్యార్హతలున్నాయి)
(ఇలాంటి డ్రెస్సులు మాత్రమే ఎందుకు? ఇంతకంటే చాలా ఎక్కువ వైవిధ్యం ఉన్న చాలా దుకాణాలున్నాయిక్కడ.)ఇదే అర్థం వచ్చే ఇంకో మాట 'copious'.Copious = Abundant = A large number ofa) Santhi: Alekhya always tops the class. She is really industrious.
(నిన్న స్వామీజీ ఉపన్యాసం చాలా ఆసక్తికరంగా ఉంది.)
Naresh: What accounts for it? (దానికి కారణం ఏమిటో?)Bhupal: I think his giving copious examples for every idea he presented are the reason. (ఆయన మనకు చెప్పిన ప్రతి భావానికీ ఎక్కువ ఉదాహరణలు ఇవ్వడంవల్ల అనుకుంటా)ఎక్కువ/ చాలా/ పెద్ద సంఖ్యలో అనే అర్థాలతో మనం వాడగల ఇంకో మాట 'countless' అయితే 'countless' ఇదివరకు చర్చించిన మాటల కంటే కాస్త తీవ్రమైన పదం.
a) Manohar: I pity Ekambar. There has been no improvement in his position at all. (ఏకాంబర్‌ను చూస్తే జాలేస్తుంది. అతడి పరిస్థితిలో ఏ విధమైన అభివృద్ధీ లేదు.)Nagesh: He has himself to blame. He let slip the countless opportunities he has had to prosper in his business. (అతడినతడే నిందించుకోవాలి/ అదంతా అతడి తప్పే. అసంఖ్యాకంగా వచ్చిన అవకాశాలన్నీ జారవిడుచుకున్నాడు.)Let slip = జారవిడవడంb) Spandana: It's really a wonder that Kumar has recovered from such a massive heart attack. (అంత తీవ్రమైన హృద్రోగం నుంచి కుమార్ కోలుకోవడం ఆశ్చర్యకరమైన విషయమే.)Jayaram: I am not surprised. Modern surgery has saved the lives of countless others. (నాకేం ఆశ్చర్యంగా లేదు. ఆధునిక శస్త్రచికిత్స చాలా మంది హృద్రోగులను/ లెక్కకు మించిన హృద్రోగులను కూడా కాపాడింది.)గమనిక: పైన మనం చూసిన expressions అన్నీ countables (లెక్కపెట్టగలిగిన వాటి)కి వాడాం ఎక్కువ సంఖ్యలో అనే అర్థంతో. వీటిలో, a lot of/ plenty of/ abundant/ copious లను uncountables (లెక్క పెట్టలేనివి, rice, sugar, milk etc) ముందు కూడా వాడవచ్చు. 'ఎక్కువ మొత్తంలో' అనే అర్థంతో.
|
Subscribe to:
Posts (Atom)