Monday, December 28, 2015

Vocabulary - 6

Sumanth: The college occupies a large area of nearly a hundred acres.(ఆ కళాశాల 100 ఎకరాల వైశాల్యం ఉన్న పెద్ద స్థలాన్ని ఆవరించి ఉంది.)Shankar: Very few colleges, especially in a populous city like ours, have such a vast campus.(మన నగరంలాంటి జనసమ్మర్థం ఉండే నగరాల్లో చాలా కొద్ది కళాశాలలకు మాత్రమే ఇంత ఆవరణ ఉంది.)
Sumanth: What do you think is our city's population?
(మన నగర జనాభా ఎంత ఉంటుందనుకుంటున్నావు?)
Shankar:
 I don't know exactly, but I am sure of one thing- for a city its size the population is on the high side.
(కచ్చితంగా నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. ఈ నగర పరిమాణానికి దీని జనాభా మాత్రం ఎక్కువే)Sumanth: I don't know the actual count either, but I am sure it is rather vast.(నాక్కూడా కచ్చితంగా ఇంత అని తెలియదు. కానీ చాలా ఎక్కువ అని మాత్రం తెలుసు.)Shankar: That the college has such a campus, and such spacious buildings in a crowded city like this is really surprising.(ఇలాంటి జనసమ్మర్థం ఉన్న నగరంలో ఇంత సువిశాలమైన కట్టడం ఉండటం ఆశ్చర్యమే.)Sumanth: No surprise at all. This was built before the city has expanded all around. Just 15 years ago, the college stood alone here, with immense open spaces around.(ఆశ్చర్యమేమీ లేదు. అన్ని వైపులా నగరం విస్తరించక ముందే ఈ కళాశాలను కట్టారు. 15 ఏళ్ల కిందటి వరకు, ఇక్కడ ఈ కళాశాల ఒకటే ఉండేది, చుట్టూ పెద్ద ఖాళీ స్థలాలుండేవి)Shankar: The college is very well provided for. It has substantial reserve funds too. In addition, it charges hefty fee, but offers generous scholarships too.(ఆ కళాశాల అవసరాలకు తగినన్ని ఆర్థిక వనరులున్నాయి. దానికి నిల్వ నిధులు కూడా భాగానే ఉన్నాయి. అదనంగా అది అధిక ఫీజులను వసూలు చేస్తుంది. కానీ ఉదాత్తమైన స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తోంది.)Sumanth: It pays handsome salaries to its staff too. That's why the college is thriving.(ఈ కళాశాల తమ సిబ్బందికి మంచి జీతాలు కూడా చెల్లిస్తుంది. అందుకే అది బాగా అభివృద్ధి చెందుతోంది.)Shankar: A number of philanthropists have donated considerable sums to the college. That also adds to the smooth functioning of the college. That has been a great help.(కళాశాలకు చాలామంది దాతలు చెప్పుకోదగిన విరాళాలు కూడా సమకూర్చారు. అది కూడా కళాశాల సాఫీగా సాగిపోయేందుకు తోడ్పడుతోంది.)Sumanth: I wish there were plenty of such colleges in India, so that all Indians could get good education.(భారతీయులు మంచి విద్య పొందేందుకు అలాంటి కళాశాలలు భారత్‌లో ఇంకా చాలా ఉండాలని నా కోరిక)Note: 1) Populous = Crowded = జన బాహుళ్యం/ ఎక్కువ జనాభా ఉండే. ముఖ్యంగా ఇది నగరాలకు, జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వాడతాం.Kolkata is a populous cityజన సమ్మర్థం - విస్తీర్ణానికి మించిన జనాభా ఉన్న నగరం కోల్‌కతా.2. Campus = Area in which an educational institution is/ విద్యాలయాల ఆవరణ3. Reserve funds = funds (amounts of money) which can be used, when there is no money = ఉపయోగానికి డబ్బు లేనప్పుడు/ తక్కువైనప్పుడు వాడుకునే నిల్వ నిధులు.4. Well provided for = supported financiallyజీవిత అవసరాలకు తగినంత ఆర్థిక వనరులు ఉన్నHis children are well provided for = అతడు తన పిల్లల అవసరాలకు తగినంత డబ్బు సమకూర్చాడు.Now look at the following sentences from the conversation above.1) The college occupies a large area.2) Very few colleges have such a vast campus.3) ... the population is on the high side.4) ... the college stood alone here, with immense open spaces around.5) In addition, it charges a hefty fee.6) A number of philanthropists have donated considerable sums.7) That has been a great help.
          
పైన Underline చేసిన మాటలన్నీ కూడా big = 'పెద్ద' అనే భావానికి సంబంధించినవి - ఎక్కువ అనే అర్థం కూడా స్ఫురించవచ్చు.          'పెద్ద' అనే అర్థంతో big, large, vast లాంటి మాటలు చాలా సామాన్యంగా వాడుతుంటాం. ఇవే కాకుండా, దాదాపుగా ఇదే అర్థంతో huge, immense, enormous అనే మాటలు కూడా ఉపయోగంలో ఉన్నాయి. అయితే వీటికి సూక్ష్మమైన తేడాలూ ఉన్నాయి. ఇప్పుడు వాటిని చూద్దాం.
1) Big = ఇది చాలా ఎక్కువగా వినబడే మాట- మనకు తెలిసిన పరిమాణం (Size) కంటే ఎక్కువగా ఉన్న/ పెద్దదైన దేన్నైనా, 'big' అనే అంటాం కదా!a) The house is big = అది పెద్ద ఇల్లు.b) The college has big buildings = ఆ కళాశాలకు పెద్దభవనాలు ఉన్నాయి.
          'పెద్ద' అనే అర్థాన్ని భౌతిక పరిమాణానికి మాత్రమే కాకుండా కొన్నిసార్లు, 'ముఖ్యమైన' (important) అనే అర్థంతో కూడా వాడతాం.Pradhan: Can't we meet him without appointment?(అనుమతి లేకుండా అతడిని కలుసుకోలేమా?)Vibhav: What do you think of him? He is a big man in the film industry.(అతడి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? చిత్ర పరిశ్రమలో ఆయన చాలా ముఖ్యుడు.)
          
వ్యావహారిక భాష (colloquial language)లో ఎక్కువ మొత్తం డబ్బుకు, "big money" అని కూడా అంటుంటాం.
Pavan: This building costs Rs.70 lac.(ఈ భవనం ఖరీదు రూ. 70 లక్షలు.)
Sravan: That's big money indeed. That's beyond me.
(అది చాలా పెద్ద మొత్తమే. నాకు భారమైందే అది.)2) Large: దీని అర్థం కూడా 'big' అనే. అయితే ఇది కాస్త formal - మామూలు spoken language లో అంతగా వాడం.a) Large areas surrounding the villages are under flood waters. (ఆ గ్రామం చుట్టూ ఆవరించిన నేల ఎక్కువ విస్తీర్ణంలో వరద నీళ్లల్లో మునిగి ఉంది.)b) Large sums of money have been spent on the project so far.(ఆ ప్రాజెక్టు కోసం చాలా పెద్ద/ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టారు.)'Large' ప్రమాణానికే (Size) కాకుండా, number/amount కు కూడా వాడతాం.3) Vast =  Extremely large in areasizeamount = చాలా ఎక్కువ విస్తీర్ణం/ పరిమాణం/ మొత్తం అనే అర్థంతో వాడతాం - Big, Large కంటే Vast మరింత ఎక్కువను సూచిస్తుంది.
Vast areas = Very large areas = బాగా ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రదేశాలు.
India is a vast country.. (భారత్ చాలా పెద్ద దేశం.)
It has vast population.(దాని జనాభా చాలా ఎక్కువ.)
It is a country with vast natural resources.(అది బాగా ఎక్కువ ప్రకృతి వనరులున్న దేశం.)గుర్తు పెట్టుకోండి ఇలా...Big (మామూలుగా వాడే మాట - ముఖ్యంగా మాట్లాడేటప్పుడు) = Large (ఎక్కువగా గ్రాంథికం) Vast = big/ large కంటే బాగా పెద్ద/ఎక్కువ.4) ఇదే అర్థంతో ఉన్న మరో మాట - Huge =  Extremely large in size, amount, or degree
a) A huge dog guarded the entrance to thehuge building.ఒక పే...ద్ద కుక్క ఆ పే...ద్ద ఇంటిని కాపలా కాస్తోంది (గతంలో)b) A huge crowd attended the meeting.(ఆ సభకు జనం గుంపులు, గుంపులుగా చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు.)
c) The company earned huge profits last year.
(కిందటేడాది ఆ కంపెనీ చాలా ఎక్కువ లాభాలు గడించింది.)
d) Huge amounts of money changed hands in the Jalayagnam program and the 2G scam.
(జలయజ్ఞం పథకం, 2G కుంభకోణంలో చాలా పెద్ద మొత్తాలు చేతులు మారాయి.) 5) Immense =  huge = బాగా పెద్దదైన/గొప్పదైన /ముఖ్యమైన/ తీవ్రమైన.The city with its immense population is experiencing shortage of water.అతి ఎక్కువ జనాభాతో ఉన్న ఆ నగరం నీటికొరతను ఎదుర్కొంటోంది.a) Sita, as the wife of Sri Rama was a woman of immense patience.(సీతాదేవి విపరీతమైన ఓర్పు గలది.)Immense fame = గొప్ప కీర్తి.
b) This project is of immense importance to the people of this area.(ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రాముఖ్యమైంది.)c) Immense joy could be seen on their faces when they heard the news.(ఆ వార్త వినగానే వాళ్ల మొహాల్లో చాలా ఎక్కువ సంతోషం కనిపించింది.)
6) On the high side = Slightly high - especially price, size etc.,ధర, పరిమాణం లాంటివి కాస్త ఎక్కువే అనేందుకు ఈ మాటలు వాడతాం.
a) Rs. 50 lac for that house is on the high side.ఆ ఇంటికి యాభై లక్షల రూపాయలు కాస్త ఎక్కువే.b) His weight, for a man of his age and height is on the high side.అతడి బరువు, ఆ వయసు, ఆ ఎత్తున్న వ్యక్తికి కాస్త ఎక్కువే.
c) Such a price for a used car as certainly on the high side.
వాడిన కారుకు అలాంటి ధర కాస్త ఎక్కువే.
7) Hefty: Used especially for a big amount of money, especially some one has to pay.(పెద్ద మొత్తంలో డబ్బును, ముఖ్యంగా మనం విధిగా చెల్లించాల్సినప్పుడు అనే అర్థంతో వాడతాం).
a) He had to pay a hefty fine of three hundred for a slight violation of traffic rules.(చిన్న traffic నిబంధన ఉల్లంఘనకు అతడు మూడు వందల రూపాయల పెద్ద రుసుం చెల్లించాల్సి వచ్చింది.)b) The college charges hefty admission fees.(ఆ కళాశాల పెద్ద మొత్తంలోనే ఫీజులు వసూలు చేస్తుంది.)

No comments:

Post a Comment